మహిమాన్వితము మనోహరము నీ దివ్య

mahimaanvithamu manooharamu nee divya

🎵 TG-2683🌐 Telugu
పల్లవి

మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము (2) నిన్నే కోరానయ్య – నిన్నే చేరానయ్య నీవే కావాలని యేసయ్య (2)     ||మహిమాన్వితము||

1వ చరణం

కోరలేదు ధన సంపద కోరినాను నిను మాత్రమే ఐశ్వర్యము కంటే అధికుడవు నీ ఆశ్రయమే చాలునయా (2)       ||నిన్నే||

2వ చరణం

జీవపు ఊటలు కల చోటికి జీవ నదులు పారే చోటికి ప్రేమతో పిలచిన నా యేసయ్యా నా దాహమును తీర్చెదవు (2)        ||నిన్నే||

3వ చరణం

తేజోనివాసుల నివాసము చేరాలనునదే నా ఆశయ్యా యుగయుగములు నే నీతో ఉండి నిత్యారాధన చేయాలని

Report Error