మహిమాన్వితుడు నా యేసు నా పాపాలు తొలగించినాడు
Mahimaanvithudu Naa Yeesu Naa Paapaalu Tholaginchinaadu
మహిమాన్వితుడు నా యేసు నా పాపాలు తొలగించినాడు కరుణామయడు నా యేసు నా భారాలు మోస్తున్నాడు ఏనాడూ మరువనులే ఏనాడూ విడువనులే కలకాలము చేస్తూ నీ ధ్యానము గడిపేస్తా నేను నా జీవనకాలము సదా .. సదా.... ||మహిమాన్వితుడు||
మనసున తలచి మొరలను తెలిపి దయ కోసం నేను ప్రార్ధింతును నిను స్తుతియించి నిను కీర్తించి హృదయములోనే ఆరాధింతును నీ వాగ్ధానము నాకే వేదము ఘన సేవగా చేస్తూ నీ ధ్యానము గడిపేస్తా నేను నా జీవనకాలము సదా... సదా... ||మహిమాన్వితుడు||
కరములు చాప కృప జూపమంటే చూపించావు దివ్య మార్గము కష్టాలన్నీ కరిగి శాపాలన్నీ తొలగి ఆనందానిచ్చే శిలువే నా ఆశ్రయము నీ వాగ్ధానము నాకే వేదము ఘన సేవగా చేస్తూ నీ ధ్యానము గడిపేస్తా నేను నా జీవనకాలము సదా... సదా... ||మహిమాన్వితుడు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.