TG-5548
Telugu

మహిమగల రాజా నిన్నే స్తుతియింతుము మహోన్నత దేవా

Mahimagala Raajaa Ninnee Sthuthiyinthumu Mahoonnatha Deevaa

0
views
పల్లవి

మహిమగల రాజా - నిన్నే స్తుతియింతుము మహోన్నత దేవా - నిన్నే కీర్తింతుము యేసురాజా - రాజుల రాజా - నిన్నే స్తోత్రింతుము యేసురాజా - రాజుల రాజా - మా సర్వం నీకిత్తుము కష్టమైన నష్టమైన - నిన్నే కొనియాడెదం శోధనలైన వేదనలైనా - నీకై జీవింతుము ఎన్ని నిందలొచ్చినా - ఎన్ని బాధలొచ్చినా నీకొరకే మేం నిలుతుము ||యేసు||

1వ చరణం

నత్తివాడైన మోషేను - నాయకుడిగా చేసెను అదృఉండ గొల్లవాడైన దావీదును - గొప్పరాజుగా మార్చెను బానిసైన యోసేపును - బహుగా బహుగా దీవించెను ||యేసు||

2వ చరణం

పిరికివాడై పేతురును - పౌరుషముతో నింపెను పొట్టివాడైన పౌలును - గట్టివాడిగా చేసెను అనుమానించే తోమాను - సిలువ సాక్షిగా మార్చెను ||యేసు||

3వ చరణం

దుక్కిదున్నే ఏలీషాను - దీర్ఘదర్శిగా మార్చెను బాలుడైన సమూయేలును - యాజకునిగా మార్చెను బలహీనుడైన గిద్యోనును - బలాఢ్యునిగా మార్చెను ||యేసు||

4వ చరణం

దిక్కులేని హదస్సాను - మహా రాణిగా చేసెను మోడుబారిన రూతును - బోయజు భార్యగా మార్చెను మగ్దలేని మరియను మారుమనసుతో నింపెను ||యేసు||