TG-3413
Telugu

మహిమగల రాజువయ్య యేసయ్యా

mahimagala raajuvayya yeesayyaa

Daniel JohnJesus Chanan Ministriesప్రకాష్ · Prakashప్రకాష్ · Prakash
0
views
Chorus

మహిమగల రాజువయ్య యేసయ్యా మహామహుని శక్తివయ్య యేసయ్యా (2)

పల్లవి పూర్వ భాగం

వందనాలయ్య యేసు వందనాలయ్య (2) ||మహిమగల||

1వ చరణం

భూమి మీద పరిమాణపు కొలవేసిన దేవుడవు వందనాలయ్య చీకటికి వెలుగునకు సరిహద్దులు గీసినావు వందనాలయ్య (నా ) జీవితమును ఏడిపించు శ్రమలన్నిటికీ హద్దులేసి సమాధానం పంపినావయ్య (2) ||వందనాలయ్య||

2వ చరణం

సమానమని ఇతనితో నిన్నెవరికి పోల్చలేము వందనాలయ్య శబ్దమై వాక్యముగా మా మధ్యకు వచ్చినావు వందనాలయ్య (నేను) పనికిరాని పాత్రనని విసిరివేయక కుమ్మరివై మరో పాత్ర చేసినావయ్య (2) ||వందనాలయ్య||

3వ చరణం

విశ్వమునే నీ ఆజ్ఞకు లోబరచిన శూరుడవు వందనాలయ్య మహా సంద్రమునే పొంగజేయు మకరమునే చంపగలవు వందనాలయ్య (నాకు) విరోధమై నిలబడిన ఆయుధాలకు ఓటమనే బహుమానము ఇచ్చినావయ్య (2) ||వందనాలయ్య||

4వ చరణం

సంకల్పము లేనినాపై సంకల్పము కలిగినావు వందనాలయ్య పాపమనే ప్రభుత్వమును నీ కృపతో దించినావు వందనాలయ్య (ఏ) కంటికైన కానరాని మలినము కడిగీ నీ అభినయ సాధనముగ మార్చినావయ్య (2) ||వందనాలయ్య||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.