పల్లవి
మహిమతో మన యేసు ఇహమునకు వేంచేయున్ సహోదరులారా మన మా మహిమలో వెలుఁగుదుము ||మహిమతో మన||
1వ చరణం
మోములు వంచి యేసు నామము నుతియించు పామరులమైన మనలఁ బ్రేమతోఁ గప్పినాఁడే ||మహిమతో మన||
2వ చరణం
పాత్రులమా మనము శత్రులమే కాదా మిత్రులన్ జేసిన వి చిత్రము తెలియలేము ||మహిమతో మన||
3వ చరణం
శిరముల పైని జీవ కిరీటములతోను బరమ దేవుని వరములు మురి యుచు మరువలేము ||మహిమతో మన||
4వ చరణం
వీణెలతో మనము నాణెమైన పాట ఋణము చెల్లింపలేమని యణఁ గి మణఁగి పాడుదుము ||మహిమతో మన||