మహిమోన్నతుడు - మహిమా న్వితుడు
mahimoonnathudu - mahimaa nvithudu
🎵 TG-1170🌐 Telugu
పల్లవి
మహిమోన్నతుడు - మహిమా న్వితుడు మరణం గెల్చిన - మృత్యుంజయుడు అద్వితీయుడు అతి సుందరుడు- అదిక జ్ఞాన సంపన్నుడు (2) ఆరాధనా ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన హల్లేలుయ హల్లేలుయ రాజుల రాజుకే హల్లేలుయా
1వ చరణం
సర్వము నెరిగిన సర్వాది కారి సర్వము చేసిన సర్వోపకారి (2) నీతిమంతుని ప్రేమించువాడు ఇశ్రాయేలును కాపాడు వాడు || ఆరాధన ||
2వ చరణం
నిత్యం వశియించు అమరుడు ఆయనే మార్గం,సత్యం,జీవము ఆయనే (2) నమ్మిన వారిని రక్షించువాడు నిత్య జీవం దయచేయువాడు || ఆరాధన ||