♪♫
TG-5551
Telugu
మహోన్నతుడా నీ కార్యాలు రమ్యమైనవి జగతిలో
Mahoonnathudaa Nee Kaaryaalu Ramyamainavi Jagathiloo
0
views
పల్లవి
మహోన్నతుడా నీ కార్యాలు రమ్యమైనవి జగతిలో ఏకైక కుమారుని - బహుమతిగా ఇచ్చావు లోకాన్ని వెలిగింప రక్షకుని పంపావు పరిశుద్ధ దేవుడవు - పరలోక నాధుడవు మహిని విడనాడిన - మహాఘనుడు యేసయ్య మాకై మరియ తనయా తగ్గించుకున్నావు మాకొరకు సింహాసనము విడనాడినావు సర్వమును విడిచావు - సర్వోన్నతుడా నీవు ఈ లోక ప్రేమలకన్నా - నీ ప్రేమే ఉన్నతం ఆ ప్రేమ శాశ్వతం - నీకే మా వందనం గగనాన దూతాళి - గళమెత్తి పాడగా ఇహలోక జనులంతా - స్తుతి గానం చేయగా పరవశించే పరలోకం - ప్రతిధ్వనించే భూలోకం జగమునేలే రారాజు జన్మించాడని ఆర్భాటముతో మేము ఎలుగెత్తి చాటేదం