మహోన్నతుడా నీ కృపలో నేను జీవించుట
mahoonnathudaa nee krupaloo neenu jeevinchuta
🎵 TG-1171🌐 Telugu
పల్లవి
మహోన్నతుడా నీ కృపలో నేను జీవించుట నాజీవిత ధన్యతై యున్నది
1వ చరణం
మోడు బారిన జీవితాలను - చిగురింప చేయ గలవు నీవు మారా అనుభవం మధురముగా మార్చ గలవు నీవు ||మహోన్నతుడా నీ||
2వ చరణం
ఆకు వాడక ఆత్మ ఫలములు ఫలియింప చేయగలవు నీవు జీవ జలముల ఊటయైనా - నీ ఓరను నను నాటితివా.. ||మహోన్నతుడా నీ||
3వ చరణం
వాడబారని స్వాస్ధ్యము నాకై - పరమందు దాచితివా వాగ్ధాన ఫలము అనుభవింప - నీ కృపలో నన్ను పిలచితివా.. ||మహోన్నతుడా నీ||