TG-5552
Telugu

మహోన్నతుడా నీ నామమునే కీర్తించుటయే ఉత్తమము

Mahoonnathudaa Nee Naamamunee Keerthinchutayee Uththamamu

13
views
పల్లవి

మహోన్నతుడా నీ నామమునే కీర్తించుటయే ఉత్తమము సర్వోన్నతుడా నీ మహిమను నే ప్రచురించుటయే భాగ్యము ఆ... రాధన... ఆ... రాధన... (2) ||మహోన్నతుడా||

1వ చరణం

ఉదయమున నీ కృపను గూర్చియు రాత్రిజామున విశ్వాస్యతను (2) పదితంతుల స్వరమండలముతో గంభీర ధ్వనిగల సితారతో (2) ప్రచురించుటయే భాగ్యము కీర్తించుటయే సౌభాగ్యము ఆ.. రాధన... ఆ... రాధన... (2) ||యెహోవా||

2వ చరణం

మందిరావరణమున నాటబడి నిత్యము చిగురించి వర్ధిల్లుచూ (2) ఖర్జూర వృక్షమువలె నీ వాక్యపు నీడలో ఎదుగుచూ (2) స్తుతియించుటయే భాగ్యము కీర్తించుటయే సౌభాగ్యము ఆ... రాధన... ఆ... రాధన... (2) ||యెహోవా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.