TG-3624
Telugu

మహోపకారుడా - సజీవ దేవుడా

mahoopakaarudaa - sajeeva deevudaa

Pranam Kamlakharజాషువు షైక్ · Joshua Shaikఅరుణిత కాంజిలాల్ · Arunita Kanjilal
0
views
Chorus

మహోపకారుడా - సజీవ దేవుడా వరాల యేసయ్య - సదా స్తుతించెద తరాలు మారిన యుగాలు దాటిన నీ ప్రేమ శాశ్వతం నీ ప్రేమ అమృతం

1వ చరణం

ఆరాధ్య దైవమా - అపురూప బంధమా నా హృదయ సీమలో- రవి కోటి తేజమా ఎనలేని బాటలో - వెనువెంట నీడగా బలహీన వేళలో - బలమైన కోటగా ఉన్నావు తోడుగా - నా ప్రాణ స్నేహమై కావాలి నీ కృపా - ఇల నాకు జీవమై నా నీతి సూర్యుడా - నా యేసు దైవమా నా జీవితాంతము - నను కాయు మేఘమా

2వ చరణం

నే కోరు సంపద - నీ ప్రేమ కౌగిలి నీ జీవ వాక్యమే - నా క్షేమ లోగిలి ఊహించలేనుగా - నీ చేతి కార్యము వివరించలేనుగా - నీ గొప్ప త్యాగము సీయోను సారధి - నీవేగ మాదిరి విశ్వాస యాత్రలో - నా మంచి కాపరి నా నీతి సూర్యుడా - నా యేసు దైవమా నా జీవితాంతము - ఆధార దీపమా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.