♪♫
TG-5542
Telugu
మము కరుణించి మహిమను వీడి మాలో ఒకనిగా మనుష్యకుమారునిగా
Mamu Karuninchi Mahimanu Veedi Maaloo Okanigaa Manushyakumaarunigaa
18
views
పల్లవి
మము కరుణించి మహిమను వీడి మాలో ఒకనిగా మనుష్యకుమారునిగా ధరణిపై వెలసిన మా దేవుడా దక్షతగల మా రక్షకుడా హల్లెలూయ (4) హల్లెలూయ అని పాడెదము ||మము||
1వ చరణం
ఇంటింట పండుగై ప్రత్యక్ష దైవమై చిన్నారి యేసువై పుట్టావయ్యా ఆది అంతములేని మా దేవుడా బలవంతుడా మహోన్నతుడా ||మము||
2వ చరణం
అరుణోదయముతో మము దర్శించి అమరత్వానికి నడిపించితివి అద్వితీయుడా ఆశ్చర్యకరుడా ఆరాధింతును ఆత్మతో నిన్ను ||మము||
3వ చరణం
రక్తమై చిందెను నీ నిత్య ప్రేమ సిలువలో మా యెడల చూపిన ప్రేమ మాకై ప్రాణము పెట్టిన ప్రేమ కొలువ లేనిది మరపురానిది ||మము||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.