TG-102
Telugu

మమున్ సృజించిన దేవుండు ప్రాణము

mamun srujinchina deevundu praannamu

204
views
పల్లవి

మమున్ సృజించిన దేవుండు ప్రాణము నొసంగి యెప్పుడు కాపాడు మమ్మును సంతోష స్వర మెత్తుచు స్తుతించుచుండుఁడాయనన్.

1వ చరణం

పలువిధాలుగ బాధించు రోగముల్ పోఁగొట్టి మీఁదకు రాకుండఁ జేసెను సంతోష స్వర మెత్తుచు స్తుతించుచుండుఁ డాయనన్. ||మమున్ సృజించిన||

2వ చరణం

దేవుండు మాత్రమే రక్షణ మార్గము ఆయత్తపఱచి చూపించె మాకును సంతోష స్వర మెత్తుచు స్తుతించుచుండుఁ డాయనన్. ||మమున్ సృజించిన||

3వ చరణం

మా నిత్యబాధలు వారించుకొరకుఁ దా సొంత పుత్రుని పంపెన్ సుప్రేమతో సంతోష స్వర మెత్తుచు స్తుతించుచుండుఁ డాయనన్. ||మమున్ సృజించిన||

4వ చరణం

ఆనంద మొందుఁడి శ్రీ యేసు మోక్షము స్వసేవకాళికి అనుగ్రహించును సంతోష స్వర మెత్తుచు స్తుతించుచుండుఁ డాయనన్. ||మమున్ సృజించిన||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.