మన మొదటి తల్లిదండ్రులల్ మాయకు
mana modati thallidandrulal maayaku
పల్లవి
మన మొదటి తల్లిదండ్రులల్ మాయకు లోనైరి అన్నలారా వారి కనుగొనలకు సిగ్గు గదుర మోములు వంచి రన్నలారా ||మన మొదటి||
1వ చరణం
తమ నగ్నతను జూడఁ దా మొప్ప లేరైరి అన్నలారా కొన్ని యమరిన మఱ్ఱాకు లంగంబులను గట్టి రన్నలారా ||మన మొదటి||
2వ చరణం
పరమాత్ముఁ డిడు నాజ్ఞఁ పాలింప లేరైరి అన్నలారా పూర్వ పరి శుద్ధత నెడబాసి పాపాత్ములై పోయి రన్నలారా ||మన మొదటి||
3వ చరణం
నరవంశజుల కెల్లఁ తరలెఁ దద్దురవస్థ అన్నలారా క్రీస్తు మర ణంబు మన పాప హరణంబుఁ గావించు నన్నలారా ||మన మొదటి||