♪♫
TG-5540
Telugu
మనలను రక్షింపను యేసు లోకాన ఉదయించెను
Manalanu Rakshinpanu Yeesu Lookaana Udayinchenu
0
views
పల్లవి
మనలను రక్షింపను - యేసు - లోకాన ఉదయించెను మన పాపాలు తొలగింపను - భువిలో - నరుడై జనియించెను సర్వజనులను రక్షింపను - శ్రీ యేసుండు దిగివచ్చెను ఆహా ఆనందమే - మహా సంతోషమే - యేసయ్య మనకొరకు పుట్టాడని రక్షణ తెచ్చెను - స్వస్థతనిచ్చెనె - చూసావ యేసయ్యను మరి విన్నావ సువార్తను దివిలోన మెరిసెను ఎన్నోతారలు మార్గము చూపెనొక తార జ్ఞానులు అనుసరించారుగా - అది మార్గము చూపించెనుగా నీలోన వెలగాలి ఒకతార - మారాలి ఈ వేళ నీ బాట ఇదే క్రిస్మస్ ఆనందము - పరలోక సంతోషము చీకటిలో ఉన్న గొల్లలను - దూత నింపెను వెలుగుతో వారిని వెలుగును అనుసారించారుగా - వారు - క్రీస్తును కనుగొన్నారుగా వెలుగుతో నిండాల నీ బ్రతుకే - యేసయ్య దిగివచ్చెనీ భువికే ఇదే క్రిస్మస్ ఆనందము - పరలోక సంతోషము