♪♫
TG-5541
Telugu
మనసా ఓ మనసా నీ ప్రియమైన యేసయ్యను
Manasaa Oo Manasaa Nee Priyamaina Yeesayyanu
0
views
పల్లవి
మనసా ఓ మనసా - నీ ప్రియమైన యేసయ్యను విరిగి నలిగినా - నిను మృదువుగ తాకిన ఆ ప్రేమను నమ్ముకో నీకు - నెమ్మది కలదు సీయోనే నీకు స్థిర నివాసము స్థిర నివాసము ఒంటరివని నీవు - కన్నీరు కార్చకు భయము నీకెందుకే - ఓ మనసా (2) అతికాంక్షనీయుడు - జయమై నిలుపు కదా జయమై నిలుపు కదా కృంగిపోకు - శ్రమలో నీవు దిగులు నీకెందుకే - ఓ మనసా (2) ప్రభువు నీకు - తోడై నడచు కదా తోడై నడచు కదా యోగ్యము కాదు - ఈ లోకము నీకు తొందరపడకే - ఓ మనసా (2) యేసయ్యే నీకు - జతగా నిలుచు గదా జతగా నిలుచు గదా