TG-3672
Telugu

మనసారా పూజించి

Manasaaraa Poojinchi

0
views
పల్లవి

మనసారా పూజించి నిన్నారాధిస్తా భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేను సంతోష గానాలను ఆలాపిస్తా (3) ||మనసారా||

1వ చరణం

నిన్న నేడు ఉన్నవాడవు నీవు (2) ఆశ్చర్యకార్యములు చేసేవాడవు నీవు (2) పరమతండ్రీ నీవే గొప్ప దేవుడవు (2) నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు (2) ||మనసారా||

2వ చరణం

రక్షణ కొరకై లోకానికి వచ్చావు (2) సాతాన్ని ఓడించిన విజయశీలుడవు (2) మరణము గెలిచి తిరిగి లేచావు (2) నీవే మర్గము సత్యము జీవము (2) ||మనసారా||