TG-3673
Telugu

మనసెరిగిన యేసయ్యా

Manaserigina Yesayyaa

0
views
పల్లవి

మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు (2) హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి నీ పత్రికనుగా మార్చావు (2) ||మనసెరిగిన||

1వ చరణం

నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై సాగిపోదును నేను ఆగిపోలేనుగా (2) సాహసక్రియలు చేయు నీ హస్తముతో నన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు (2) ||మనసెరిగిన||

2వ చరణం

వెనకున్న వాటిని మరచి నీ తోడు నేను కోరి ఆత్మీయ యాత్రలో నేను సొమ్మసిల్లి పోనుగా (2) ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు (2) ||మనసెరిగిన||

3వ చరణం

మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై ప్రభు బల్లారాధనకు దూరము కాలేనుగా (2) నేలమంటితో నన్ను రూపించిన హస్తములే నన్ను కౌగిలించెనే వదలలేవు ఎన్నడు (2) ||మనసెరిగిన||