మనసు నిచ్చి వినుమా మది ననుసరించి చనుమా ||మనసు నిచ్చి||
అరయ యేసు సిలువ యది అమరపురికి త్రోవ ఆ రమ్యమైన త్రోవ యది యనుసరించినావ అది యరసి చూచినావ? ||మనసు నిచ్చి||
అది నడచి నడచి పోను ఆనందమిచ్చి చనును అది యేసు సిలువ మ్రాను అది యనుసరింపదగును అది యందరు చనదుగును ||మనసు నిచ్చి||
రక్తమయపు బాట నీ ముక్తికదియె యూట భక్తులందరి యెదుట స ద్భక్తి మెరయు పాట లనురక్తి బాడెదరచట ||మనసు నిచ్చి||
ఎంత పాపమైన మదికెంత భారమైన ఎంత దయయోగాని యది ఎంత కృపయొ గాని అతి శాంతి నిచ్చులోన ||మనసు నిచ్చి||
సాటిలేనిదారి మన స్వామిచూపుదారి మేటికల్వరిదారి జనకోటి దుర్గుణహారి మనకోటకు రహదారి ||మనసు నిచ్చి||
వలదులోకమేల నీ వలపు నా కికేల నిలువుమింక చాలు నని బిలుచు యేసుమ్రోల నే గొలుతు కాలమెల్ల ||మనసు నిచ్చి||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.