TG-3674
Telugu

మనసులొకటాయే భువిలో

Manasulokataaye Bhuvilo

16
views
పల్లవి

మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో (2) మనసు పరవశమై మధుర లాహిరిలో (2) మనసులోని భావాలు ఉరకలు వేసే ఈ వేళా ||మనసులొకటాయే||

1వ చరణం

ఎవరికెవరొక నాడు ఈ క్షణాన ఇచ్చోట దేవ దేవుని సంకల్పం ఈ శుభ ఘడియా (2) ఈ మధురమైన శుభవేళ (2) ఒకరికొకరు తోడు నీడగా సాగే ఈ తరుణం ||మనసులొకటాయే||

2వ చరణం

అనురాగం నీ ప్రాణమై అభిమానం నీ స్నేహమై జీవితాంతం ఒకరికొకరు ప్రేమ మూర్తులుగా (2) ఘన యేసుని దివ్య ఆశీస్సు (2) జీవితాంతం నిండుగ మెండుగ నీతో నిలిచే ఈ తరుణం ||మనసులొకటాయే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.