♪♫
TG-3675
Telugu
మంచే లేని నా పైన
Manche Leni Naa Paina
0
views
పల్లవి
మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు (2) ఆదియంత మైనవాడవు – మానవుని రూపమెత్తావు (2) పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి (2) ఎంతగా .. ఎంతగా.. ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ ఋణము తీరునా (2) ||మంచే లేని||
1వ చరణం
లోకాలన్నీ ఏలే రారాజు వైన నీవు సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు (2) నీదెంత దీన మనస్సు నా కెంత ఘనత యేసు (2) ||ఎంతగా||
2వ చరణం
నాశనమైన నన్ను రక్షించగోరి నీవు వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు (2) నీలోన జాలి పొంగె నాలోన శాంతి నిండె (2) ||ఎంతగా||
3వ చరణం
చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు వేకువ వెలుగు వంటి దర్శనము నిచ్చినావు (2) నీ సాటిలేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం (2) ||ఎంతగా||