TG-5275
Telugu

నీ కృపయే నన్ను కాచెను నీ దయయే నన్ను దాచెను

Nee Krupayee Nannu Kaachenu Nee Dayayee Nannu Daachenu

0
views
పల్లవి

నీ కృపయే నన్ను కాచెను - నీ దయయే నన్ను దాచెను నీ క్షమయే నన్ను ఓరెను - నీ వాక్యమే ఓదార్చెను (2) చాలయ్యా నీ కృప చాలునయ్యా (4) ||నీ కృపయే||

1వ చరణం

గాఢాంధకారములో - నేనుండగా నీ సన్నిధియే నాకు - వెలుగాయెగా నా శత్రువుయే నన్ను - తరుముచుండగా నా స్థానములో నిలిచి - పోరాడెగా భయభీతులలో - నేనుండగా అవమానములో - అల్లాడగా (2) నాకాపరియై - నన్ను చేరెగా నావైరులను - వెళ్ళెగొట్టెగా చాలునయ్యా - నీ కృప చాలునయ్య (4) ||నీ కృపయే||

2వ చరణం

నావారే నన్ను - గెంటి వేయగా మరణభయమే - నన్ను ఆవరింపగా నా చెంతచేరి నన్ను - స్వస్థపరిచెగా నీ చేయి చాచి నన్ను - చేరదీసెగా అపజయమే నన్ను - కృంగదీయగా అంటరానిదాననని - గేళిచేయగా (2) నా పక్షమున చేరి - జయమిచ్చెగా నాతో వుంటానని - మాటిచ్చెగా చాలునయ్యా - నీ కృప చాలునయ్య (4) ||నీ కృపయే||