TG-5279
Telugu

నీ చిత్తం నా యెడల జరిగించుము నీ ప్రణాళికలో నేనుండుట భాగ్యము

Nee Chiththan Naa Yedala Jariginchumu Nee Pranaallikaloo Neenunduta Bhaagyamu

23
views
పల్లవి

నీ చిత్తం నా యెడల జరిగించుము నీ ప్రణాళికలో నేనుండుట భాగ్యము (2) నీ సంకల్పం నెరవేర్చుట నాకు ఆనందము నీ నెరవేర్పులో నేనుండుట ఆశీర్వాదము (2) నీ చిత్తమును నెరవేర్చెదను అనుదినము నీ మాటకు నే లోబడతాను ప్రతి క్షణము (2) జగతికి పునాది వేయక ముందే నను ఏర్పరచావు గర్భములో రూపింపక ముందే పిలుచుకొన్నావు  (2) ఈ సృష్టిని నోటి మాటతో చేసిన దేవుడవు నీవు నీ స్వహస్తములతో నను నిర్మించిన ప్రభుడవు నీవు (2) నీ చిత్తమును నెరవేర్చెదను అనుదినము నీ మాటకు నే లోబడతాను ప్రతి క్షణము (2) పాపములో పడియుండగా నన్ను లేవనెత్తావు మలినమునంతా కడిగి నాకు అర్హతనిచ్చావు (2) వెలకట్టి నాకు విలువను ఇచ్చిన దేవుడవు నీవు నీ రాజ్యములో స్థిర స్థానమునిచ్చిన ప్రభుడవు నీవు (2)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.