TG-5280
Telugu

నీ చిత్తము సంపూర్తిగా నాలో జరిగించుమా

Nee Chiththamu Sanpoorthigaa Naaloo Jariginchumaa

22
views
పల్లవి

నీ చిత్తము సంపూర్తిగా నాలో జరిగించుమా నీ పరిపూర్ణ సంకల్పంలో నన్ను నడిపించుమా (2) నీ ఉద్దేశ్యములు - ఉన్నతమైనవి నీ ఆలోచనలు - గంభీరమైనవి (2) నా పూర్ణ హృదయముతో - నా పూర్ణ ఆత్మతో నా పూర్ణ మనస్సుతో - నా పూర్ణ శక్తితో యేసు నిన్నే ప్రేమింతును - నీ ఆజ్ఞలను గైకొందును (2) నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినావు నా అంతరింద్రియములను నీవే కలిగించినావు (2) నాయెడల నీకున్న తలంపులు బహు విస్తారములు నా ప్రభువా (2) నీ ఇష్టమే నాలో నేరవేర్చుమా (2) నీకు వేరుగా ఉండి నేనేమి చేయలేను నీకు లోబడకుండా నేను వర్దిల్లలెను (2) నీ కట్టడలను నాకు బోధించి నీ వాక్యంతో నన్ను నిలుపుము (2) నీ ఇష్టమే నాలో నేరవేర్చుమా (2)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.