TG-5274
Telugu

నీ కృపయే ఇది నీ కృపయే ఇన్నాళ్ళుగా నను ఇలలో కాపాడినది

Nee Krupayee Idi Nee Krupayee Innaallllugaa Nanu Ilaloo Kaapaadinadi

17
views
పల్లవి

నీ కృపయే ఇది నీ కృపయే ఇన్నాళ్ళుగా నను ఇలలో కాపాడినది బహు శ్రేష్టమైన ఈవులెఎన్నో దయచేసినది నీ దివ్య సన్నిధిలో నన్ను చేర్చినది ఈ లోక బంధాలన్నీ మరిపించినది పక్షిరాజువై నీ రెక్కలపై మోసి అందని శిఖరాలు ఎక్కించితివి నా కన్నీటిని - నీ పాత్రలో దాచి ఎడారిలోనా - సెలయేరు పుట్టించినది కన్న తండ్రివై నీ ఆక్కున ననుచేర్చి ఎన్నో అపాయాలు తప్పించితివి శ్రమల సంద్రంలోన వ్యాధి బాధలలోన నీ నామమే ఊపిరై బ్రతికించినది

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.