♪♫
TG-5278
Telugu
నీ కోసం ఏదైనా చేయాలన్నదే నా ఆశ దేవా
Nee Koosan Eedainaa Cheeyaalannadee Naa Aasha Deevaa
18
views
పల్లవి
నీ కోసం ఏదైనా చేయాలన్నదే నా ఆశ దేవా నా ప్రాణం ఏమైనా మిగిలుండగ నా శ్వాస దేవా నా ప్రాణం ఏమైనా మిగిలుండగ నా శ్వాస దేవా ప్రాణం కన్నా ప్రేమించావే అర్హత కన్నా దీవించావే ||దేవా నా దేవా||
1వ చరణం
వాగ్దాన ఫలముగా నిరీక్షించి పొందిన ప్రియమైన తనయుని అర్పించమనగా లేశమైన శంకించక యెహోవా ఈరే అని అర్పించబోయిన అబ్రాహాములా ||దేవా నా దేవా||
2వ చరణం
క్షమియించబడితిని బహు ఘోర పాపిని బ్రతుకైనా చావైన క్రీస్తుతోటి లాభమే యేసు పడిన పాట్లలో కొదువైన వాటిని అనుభవించగోరిన భక్త పౌలులా ||దేవా నా దేవా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.