TG-1960
Telugu

మంచే లేని నా పైన

manchee leeni naa paina

77
views
పల్లవి

మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు (2) ఆదియంత మైనవాడవు – మానవుని రూపమెత్తావు పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి ఎంతగా .. ఎంతగా.. ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ ఋణము తీరునా (2) ||మంచే||

1వ చరణం

లోకాలన్నీ ఏలే రారాజు వైన నీవు సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు నీదెంత దీన మనస్సు నా కెంత ఘనత యేసు ||ఎంతగా||

2వ చరణం

నాశనమైన నన్ను రక్షించగోరి నీవు వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు నీలోన జాలి పొంగె నాలోన శాంతి నిండె చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు వేకువ వెలుగు వంటి దర్శనము నిచ్చినావు నీ సాటిలేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.