TG-3340
Telugu

మంచి నాలొ లేదయ్యా వంచకుని ఎలా ప్రేమించితివి

manchi naalo leedayyaa vanchakuni elaa preeminchitivi

JP Rameshలిప్సిక · Lipsika
0
views
Chorus

మంచి నాలొ లేదయ్యా వంచకుని ఎలా ప్రేమించితివి విలువేమి లేదయ్యా నాకు వెల చెల్లించితివి (2) పరలోకము చేర్చుటకు నా వరముగ దిగి వచ్చావయ్యా (2) ఈ దీనుని కరుణించి నీ దీవెనతో నింపావయ్యా మమకారపు మహనీయ మదినిండా నీవెనయ్యా (2) ||మంచి నాలొ||

Verse 1

ఒంటరీ పయనంలో నాకంట తడి తుడిచి నాతోనే నిలిచావు నా జంటగ నడిచావు (2) సమస్యల సుడిగుండాలే నన్ను చుట్టిముట్టిన వేళలో (2) నీ చేయిచాచి నను లేపి నడిపిన నా నావిక ||మంచి నాలొ||

Verse 2

ఊహించనీ తరుణంలో ఎటుతోచని గమనంలో మరపురాని మారాను మధురముగా మార్చావు (2) ఆనందపు ఆశల సౌధం ఆవిరైన ఆవేళలో (2) నీ రెక్కలనీడన దాచి కాచిన నా రక్షక ||మంచి నాలొ||

Verse 3

వేసారిన వేళలో వెన్నంటిన వేదనలో విసుగును తొలగించావు వినమ్రత నేర్పావు (2) కాపాడవలసిన వారే కాలు దువ్విన కాలములో (2) నీ చల్లని చూపుతో విజయమిచ్చిన జయ సూచక ||మంచి నాలొ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.