TG-2968
Telugu

మంచి స్నేహితుడు యేసు నాథుడు

manchi sneehitudu yeesu naathudu

Pr D.Isaac Gnana Rajప్రొఫెసర్ డి.ఐసాక్ జ్ఞాన రాజ్ · Pr D.Isaac Gnana Rajప్రొఫెసర్ డి.ఐసాక్ జ్ఞాన రాజ్ · Pr D.Isaac Gnana Raj
34
views
Chorus

మంచి స్నేహితుడు యేసు నాథుడు మన కొరకు బలియైన ప్రాణ నాధుడు (2)

1వ చరణం

సర్వశక్తిమంతుడు బలమైన దేవుడు సర్వమును సృజించిన శ్రీ యేసు నాధుడు (2) మంటి రూపం దాల్చెను మహిమను విడచి వచ్చెను పాపమే లేని పరిశుద్ధుడు సిలువలో విలవిల లాడెను ||మంచి స్నేహితుడు||

2వ చరణం

మన పాపములు అన్నియు మోపబడెను ఆయనపై వధింపబడిన గొర్రెవలె సిలువలో బలియై లేచెను (2) అన్యాయ తీర్పునొంది నలుగ గొట్ట బడెను మౌనముగా భరించెను ప్రాణము పెట్టి లేచెను ||మంచి స్నేహితుడు||

3వ చరణం

దేవునితో సమముగా ఉండె భాగ్యము వీడి దాసుని రూపం దాల్చి రిక్తుడు తానాయెను (2) ముండ్ల కిరీటం కొరడా దెబ్బలు చేతులు కాళ్ళకు మేకులు క్రూరమైన మరణం నొంది దేవుని ప్రేమను చూపెను ||మంచి స్నేహితుడు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.