TG-3678
Telugu

మంచి స్నేహితుడు

Manchi Snehithudu

0
views
పల్లవి

మంచి స్నేహితుడు (2) హితమును కోరే బ్రతుకును మార్చే ప్రాణస్నేహితుడేసు (2) ||మంచి స్నేహితుడు||

1వ చరణం

ఒరిగిన వేళ పరుగున చేరి గుండెలకదిమే తల్లవుతాడు అక్కరలోన పక్కన నిలిచి చల్లగ నిమిరే తండ్రవుతాడు ఒంటరితనమున చెలిమవుతాడు కృంగిన క్షణమున బలమవుతాడు – (2) ||మంచి స్నేహితుడు||

2వ చరణం

చీకటి దారుల తడబడు ఘడియల వెచ్చగ సోకే వెలుగవుతాడు పతనపు లోయల జారిన వేళల చెయ్యందించే గెలుపవుతాడు శోధనలోన ఓర్పవుతాడు శోకంలో ఓదార్పవుతాడు – (2) ||మంచి స్నేహితుడు||