♪♫
TG-3679
Telugu
మంచిని పంచే దారొకటి
Manchini Panche Daarokati
24
views
పల్లవి
మంచిని పంచే దారొకటి వంచన పెంచే దారొకటి రెండు దారులలో నీ దారి ఎంచుకో బాటసారి సరి చూసుకో ఒక్కసారి (2) మొదటి దారి బహు ఇరుకు – అయినా యేసయ్యుంటాడు ప్రేమా శాంతి కరుణ – జనులకు బోధిస్తుంటాడు (2) పాపికి రక్షణ తెస్తాడు పరలోక రాజ్యం ఇస్తాడు (2) అందుకే.. ఇరుకు దారిలో వెళ్ళయ్యా విశాల మార్గం వద్దయ్యా ||మంచిని||
1వ చరణం
మరియొక దారి విశాలం – కాని సాతానుంటాడు కామం క్రోధం లోభం – నరులకు నేర్పిస్తాడు (2) దేవుని ఎదిరిస్తుంటాడు నరకాగ్నిలో పడదోస్తాడు (2) అందుకే.. ఇరుకు దారిలో వెళ్ళయ్యా విశాల మార్గం వద్దయ్యా ||మంచిని||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.