మండించు ప్రభువా నీ ఆత్మ నాలో ప్రకాశించెద నీ ప్రతిబింబమై
Mandinchu Prabhuvaa Nee Aathma Naaloo Prakaashincheda Nee Prathibinbamai
మండించు ప్రభువా నీ ఆత్మ నాలో - ప్రకాశించెద నీ ప్రతిబింబమై రగిలించు ప్రభువా ఉజ్జీవము - వెలిగించెద అనేకులను (2) అభిషేకించయా నన్ను మండించయా-నాపై ప్రోక్షించయా నీ ఆత్మను (2) అంత్యకాలపు అభిషేకం కుమ్మరించుము మాపైన మండుచున్న పొదలాగ ఆరకుండ మండించయ్యా (2) పెంతెకోస్తు దినమున దిగిన ఆత్మవర్షము కురిపించయ్యా మేడగదిలో పొందిన అనుభవం నేడు మాకు ఇమ్మయ్యా ||అభిషేకించయా||
అంధకార శక్తులను నీదు ఆత్మతో బంధించయ్యా దాగివున్న సర్పములన్ కాల్చివేయుము నీ అగ్నిలో (2) ఎండిపోయిన ఎముకలను జీవింపచేయుము నీ ఆత్మతో శరీర క్రియలను నసింపజేసే దహించు ఆత్మతో నింపయ ||అభిషేకించయా||
ఆత్మ కలిగిన పరిచర్య చేయు జ్ఞానము మాకిమ్మయా మహిమ కలిగిన కార్యములు సంఘమందు జరిగించయా (2) మాలో ఉన్న కృపావరములు ప్రజ్వలింప చేయుమయా నిత్యము మండే బలిపీఠముగా అగ్ని మాలో రగిలించయా ||అభిషేకించయా||