♪♫
TG-3682
Telugu
మంగళమే యేసునకు
Mangalame Yesunaku
0
views
పల్లవి
మంగళమే యేసునకు – మానుజావతారునకు (3) శృంగార ప్రభువునకు (2) క్షేమాధిపతికి మంగళమే ||మంగళమే||
1వ చరణం
పరమ పవిత్రునకు – వర దివ్య తేజునకు (3) నిరుపమానందునకు (2) నిపుణ వేద్యునకు మంగళమే ||మంగళమే||
2వ చరణం
దురిత సంహారునకు – వర సుగుణోదారునకు (3) కరుణా సంపన్నునకు (2) జ్ఞాన దీప్తునకు మంగళమే ||మంగళమే||
3వ చరణం
సత్య ప్రవర్తునకు – సద్ధర్మ శీలునకు (3) నిత్య స్వయంజీవునకు (2) నిర్మలాత్మునకు మంగళమే ||మంగళమే||
4వ చరణం
యుక్త స్తోత్రార్హునకు – భక్త రక్షామణికి (3) సత్య పరంజ్యోతి యగు (2) సార్వభౌమునకు మంగళమే ||మంగళమే||
5వ చరణం
నర ఘోర కలుషముల – నురుమారంగ నిల (3) కరుదెంచిన మా పాలి (2) వర రక్షకునకు మంగళమే ||మంగళమే||
6వ చరణం
పరమపురి వాసునకు – నర దైవ రూపునకు (3) పరమేశ్వర తనయునకు (2) బ్రణుతింతుము నిన్ను మంగళమే ||మంగళమే||