TG-075
Telugu

మంగళంబని పాడరే క్రీస్తుకు జయ

mangallanbani paadaree kreesthuku jaya

200
views
పల్లవి

మంగళంబని పాడరే క్రీస్తుకు జయ మంగళంబని పాడరే యేసుకు జయ మంగళంబని పాడరే మంగళంబని పాడి సజ్జ నాంగ పూజితుఁడై కృపాత రంగిలోక సమూహ పాపవి భంగుడని యుప్పొంగి జయజయ ||మంగళంబని పాడరే||

1వ చరణం

ఘన యూద దేశంబులో బెత్లెహే మున యూదా గోత్రంబులో వినుఁ డు యేసేపునకు సతియై తనరుచుండెడి మరియ కడుపున జననమై యీ మర్త్య వరులకు సద్గతిని గల్గించు వానికి ||మంగళంబని పాడరే||

2వ చరణం

సోదరాళి భంగిని భక్తుల నల్లఁ జూచి ప్రోచెడు వానిని యూద దేసపు వారలధిక బాధఁబెట్టుచు హింసఁజేసిన సాదరంబున త్రిదినములకు ముదముతో గనుపడిన ప్రభునకు ||మంగళంబని పాడరే||

3వ చరణం

ధరణి న్గొల్చెడి దాసజ నములనుఁబ్రోచు దైవ తనయుఁడని నిజ మరయ నిలను స్మరించువారికి గురుతరంబగు కలుష జలనిధి దరికి( జేర్చు పరమ పదమే యిరు వొనర్చెద ననిన ప్రభునకు ||మంగళంబని పాడరే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.