TG-3683
Telugu

మనిషి బ్రతుకు రంగుల

Manishi Brathuku Rangula

0
views
పల్లవి

మనిషి బ్రతుకు రంగుల వలయం ఆ బ్రతుకే క్షణ భంగురం (2) మారాలి ప్రతి హృదయం వెదకాలి క్రీస్తు రాజ్యము (2) ||మనిషి||

1వ చరణం

గడ్డి పువ్వురా మనిషి జీవితం గాలి వీచగా రాలిపోవును (2) గాలిలో నిలువని దీపమురా ఇది గాలిలో ఎగిరే గాలిపటం రా (2) తెలుసుకో ఓ మానవా ఈ క్షణమే ప్రభు యేసుని (2) ||మనిషి||

2వ చరణం

ఆత్మ వెళ్లగా శవమని నిన్ను ఇంట నుంచరు పంచ చేర్చెదరు (2) ఇరుగు పొరుగువారు కూడ కొందరు వల్లకాటి వరకే వచ్చెదరు (2) తెలుసుకో ఓ మానవా ఈ క్షణమే ప్రభు యేసుని (2) ||మనిషి||

3వ చరణం

ధనమున్నదని గర్వించకురా ధనమే నీకు తోడు రాదురా (2) లోకమే నీకు అశాశ్వతంబురా పరలోకమే నీకు శాశ్వతంబురా (2) తెలుసుకో ఓ మానవా ఈ క్షణమే ప్రభు యేసుని (2) ||మనిషి||