TG-1374
Telugu

మన్నేగదయ్యా మన్నేగదయ్యా (2) మహిలోని

manneegadayyaa manneegadayyaa (2) mahilooni

77
views
పల్లవి

మన్నేగదయ్యా మన్నేగదయ్యా (2) మహిలోని ఆత్మ జ్యోతియు తప్ప మహిలోనిదంతా మన్నేగదయ్యా (2) ||మన్నేగదయ్యా||

1వ చరణం

మంచిదంచు ఒకని యించు సంచిలోనే ఉంచినా మించిన బంగారము మించిన నీ దేహము ఉంచుము ఎన్నాళ్ళకుండునో మరణించగానే మన్నేగదయ్యా ఎన్ని నాళ్ళు లోకమందు ఉన్నతముగా నిలిచినా నిన్ను చూచి లోకులంతా ధన్యుడవని పిలిచినా మెల్లని పుష్పంబు పోలినా పుష్పంబుతోనే ఊడిపడినది మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము ఒక్కనాడు ఆరిపోగా నీలో ఆత్మ దీపము కుక్క శవంతో సమమేగా నిక్కముగనదియు మన్నేగదయ్యా మానవునికి మరణమింత ఎంచనంత మన్నిల మరణమును జయించుచున్న కాలమింత మన్నిల మరణ విజయుడేసు క్రీస్తుడే మది నమ్ము నిత్య జీవమిచ్చ్చును

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.