♪♫
TG-3685
Telugu
మన్నేగదయ్యా మన్నేగదయ్యా
Mannegadayyaa Mannegadayyaa
0
views
పల్లవి
మన్నేగదయ్యా మన్నేగదయ్యా (2) మహిలోని ఆత్మ జ్యోతియు తప్ప మహిలోనిదంతా మన్నేగదయ్యా (2) ||మన్నేగదయ్యా||
1వ చరణం
మంచిదంచు ఒకని యించు సంచిలోనే ఉంచినా మించిన బంగారము మించిన నీ దేహము (2) ఉంచుము ఎన్నాళ్ళకుండునో మరణించగానే మన్నేగదయ్యా (2) ||మన్నేగదయ్యా||
2వ చరణం
ఎన్ని నాళ్ళు లోకమందు ఉన్నతముగా నిలిచినా నిన్ను చూచి లోకులంతా ధన్యుడవని పిలిచినా (2) మెల్లని పుష్పంబు పోలినా పుష్పంబుతోనే ఊడిపడినది (2) ||మన్నేగదయ్యా||
3వ చరణం
మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము ఒక్కనాడు ఆరిపోగా నీలో ఆత్మ దీపము (2) కుక్క శవంతో సమమేగా నిక్కముగనదియు మన్నేగదయ్యా (2) ||మన్నేగదయ్యా||
4వ చరణం
మానవునికి మరణమింత ఎంచనంత మన్నిల మరణమును జయించుచున్న కాలమింత మన్నిల (2) మరణ విజయుడేసు క్రీస్తుడే మది నమ్ము నిత్య జీవమిచ్చ్చును (2) ||మన్నేగదయ్యా||