TG-3686
Telugu

మన్నించే ప్రేమ

Manninche Prema

0
views
పల్లవి

మన్నించే ప్రేమ - కనిపించే నీలో - ఆదరించావుగా - నా దేవ నా యేసయా లాలించే నీ ప్రేమ - ఉప్పొంగే నాలోన - ఏనాటి అనుబంధమో గుండెల్లో నీవేగా - సంతోష గానంగా - సాగాలి కలకాలము ఏపాటి నన్ను - ప్రేమించినావు - తీర్చేదెలా నీ ఋణం - నీకేగా ఈ జీవితం 1. నీతో మాట - నీతో బాట - వరమే ఈ పయనం ఆశే నీవై - ధ్యాసే నీవై - కొలిచే ఈ సమయం ఉన్నావు తోడు నీడై నాతో - నా యేసయ్యా దాచావు ఎన్నో మేళ్లు నాకై - నా యేసయ్యా నీవు లేనిదే - మనలేనుగా - నీవేగా నా ధైర్యము ఆటంకాలెన్నున్నా అవమానాలెదురైనా రక్షించే దైవంగా - విశ్వాసం నీవేగా నీవే కదా యేసయ్య - ఆధారం నీవేనయ్యా నాలోన చిరు కోరిక - నీతోనే బ్రతకాలిక 2. నీవే ప్రాణం - నీవే ధ్యానం - పలికే నా హృదయం భారం మోసి - బలమే నింపి - మలిచే నా గమనం చుక్కాని నీవై దారే చూపే - నా యేసయ్య అందాల లోకం నీలో చూసా - నా యేసయ్య ప్రతి చోటున నీ సాక్షిగా జీవించే నా భాగ్యము నా జీవితపయనంలో - బలహీన సమయంలో ఓదార్చే దైవంగా - నిలిచింది నీవేగా నీవే కదా యేసయ్య - ఆధారం నీవేనయ్యా నాలోన చిరు కోరిక - నీతోనే బ్రతకాలిక Manniche Prema - Kanipinche Neelo - Aadharinchaavugaa - Naa Deva Naa Yesayaa Laalinche Nee Prema - Upponge Naalona - Yenaati Anubandhamo Gundello Neevegaa - Santhosha Gaanamga - Saagaali Kalakaalamu Yepaati Nannu - Preminchinaavu - Teerchedelaa Nee Runam - Neekegaa Ee Jeevitham 1. Neetho Maata - Neetho Baata - Varame Ee Payanam Aase Neevai - Dhyaase Neevai - Koliche Ee Samayam Unnavu Thodu Needai Naatho - Naa Yesayya Daachaavu Enno Mellu Naakai - Naa Yesayya Neevu Lenidhe - Manalenugaa - Neevegaa Naa Dhairyamu Aatankaalennunnaa - Avamaanaaledhurainaa Rakshinche Dhaivamgaa - Viswaasam Neevegaa Neeve Kadha Yesayya - Aadhaaram Neevenayya Naalona Chiru Korika - Neethone Brathakaalika 2. Neeve Praanam - Neeve Dhyaanam - Palike Naa Hrudhayam Bhaaram Mosi - Balame Nimpi - Maliche Naa Gamanam Chukkani Neevai Dhaare Choope - Naa Yesayya Andhaala Lokam Neelo Choosa - Naa Yesayya Prathi Chotuna Nee Sakshigaa Jeevinche Naa Bhagyamu Naa Jeevitha Payanamulo - Balaheena Samayamulo Odhaarche Dhaivamga - Nilichindhi Neevegaa Neeve Kadha Yesayya - Aadhaaram Neevenayya Naalona Chiru Korika - Neethone Brathakaalika