మణులు మాణిక్యములున్నా మేడమిద్దెలు ఎన్నున్నా
mannulu maannikyamulunnaa meedamiddelu ennunnaa
మణులు మాణిక్యములున్నా మేడమిద్దెలు ఎన్నున్నా మదిలో యేసులేకున్నా ఏది ఉన్నా అది సున్నా ||మణులు మాణిక్యములున్నా||
చదువులెన్నో చదివివున్నా పదవులెన్నో చేస్తున్నా విద్యవున్నా బుద్ధివున్నా జ్ఞానమున్నా అది సున్నా ||మణులు మాణిక్యములున్నా||
అందచందా లెన్నున్నా అండములపై కూర్చున్నా సుందరుడు ప్రభులేక యున్నా అందమున్నా అది సున్నా ||మణులు మాణిక్యములున్నా||
రాజ్యములు రమణులు ఉన్నా శౌర్యములు వీర్యము లున్నా బలము ఉన్నా బలగమున్నా ఎన్నివున్నా అవి సున్నా ||మణులు మాణిక్యములున్నా||
పూజ్యుడా పుణ్యాత్ముండా పుణ్యకార్య సిద్ధుడా దానధర్మము జపము తపము యేసులేనిది అదిసున్నా ||మణులు మాణిక్యములున్నా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.