TG-2962
Telugu

మరణాన్ని గెలిచినోడు నీలో ఉన్నవాడు

maranaanni gelichinoodu neeloo unnavaadu

Davidson RajaSaati Yevaru ( 2016 )జోయెల్ ఎన్ బాబ్ · Joel N Bobజోయెల్ ఎన్ బాబ్ · Joel N Bob
5
views
Chorus

మరణాన్ని గెలిచినోడు నీలో ఉన్నవాడు - నాలో ఉన్నవాడు మనలో ఉన్నవాడు - మరణాన్ని గెలిచినోడు ( 2 ) లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు (2) మృత్యుంజయుడు - మృత్యుంజయుడు మృత్యుంజయుడు తానే మృత్యుంజయుడు (2) నీలో ఉన్నవాడు - నాలో ఉన్నవాడు మనలో ఉన్నవాడు - మరణాన్ని గెలిచినోడు (2)

1వ చరణం

యెహోవా నీ పక్షముండగా విరోధి ఎవరు నే నమ్మిన దేవుడు నమ్మకస్థుడు (2) గుర్రమునుబట్టి కాదు - రథమునుబట్టి కాదు ( 2 ) యెహోవా నామం బట్టి అతిశయింతును (2) మృత్యుంజయుడు - మృత్యుంజయుడు మృత్యుంజయుడు తానే మృత్యుంజయుడు (2) నీలో ఉన్నవాడు - నాలో ఉన్నవాడు మనలో ఉన్నవాడు - మరణాన్ని గెలిచినోడు (2)

2వ చరణం

ఇశ్రాయేలు జనమును సంద్రం మధ్య నడిపినోడు ఎగసే అలలపైనా ధీటుగా నడచినోడు (2 ) నిను కాపాడువాడు - నీ కాపారైనవాడు ( 2 ) కునకడు నిద్రపోడు యెన్నడెన్నడు (2 ) మృత్యుంజయుడు - మృత్యుంజయుడు మృత్యుంజయుడు తానే మృత్యుంజయుడు (2) నీలో ఉన్నవాడు - నాలో ఉన్నవాడు మనలో ఉన్నవాడు - మరణాన్ని గెలిచినోడు (2)