♪♫
TG-3688
Telugu
మరణము నన్నేమి చేయలేదు
Maranamu Nannemi Cheyaledu
0
views
పల్లవి
మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి చేయగలదు (2) నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడైయున్నావు (2) ||మరణము||
1వ చరణం
నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయే (2) నను సీయోనులో చేర్చుకొనుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము||
2వ చరణం
నీ రూపమును పొంది జీవించుటే ఆశ సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి (2) విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము||
3వ చరణం
నీ కొరకు శ్రమపడుటే నాకెంతో భాగ్యము పరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము (2) నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్దించుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము||
4వ చరణం
నీ కొరకు ఖైదీనై ఉండుటే ధన్యత సంఘమును మేల్కొలిపే ఊటలు దయచేసి (2) దెయ్యాలు గడ గడ వనుకుచు కేకలు వేసే సేవ చేయుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము||