TG-2634
Telugu

మరువగలనా మరలా – ఇలలో

maruvagalanaa maralaa – ilaloo

50
views
పల్లవి

మరువగలనా మరలా – ఇలలో గనని కరుణా ఈలాంటి ప్రేమను కలిగినను క్షమించు నింతటి నేరమును జీవిత కాలమంతా – యేసు ధ్యానము చేసెదను ఆశయు అక్కరయు పాపమై చిక్కితి శత్రువు చేతులలో మరణపు టంచున చేరితిని ఇంతలోనే యేసు కరుణింప వచ్చి క్షమియించి విడిపించెను నిందను పొందినను – ప్రభు చెంతకు చేరెదను ఏ పాపికి కడు భాగ్యమే యేసుని చేరగ ధన్యమే యేసుని ప్రేమ అనంతమే నీ పాపమంతా తొలగించి యేసు ప్రేమించి దీవించును నీ భారమంతయు భరియించును కన్నీరు తుడిచి ఓదార్చును శాశ్వత ప్రేమ చూపి – తన కౌగిట దాచుకొనున్ ఆ సిల్వ ప్రేమను చూపెదను నా క్రీస్తు వార్తను చాటెదను జీవిత కాలమంత – యేసు ధ్యానము చేసెదను

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.