మరువనిది నీ ప్రేమ విడువనిది నీ కృప ఎడబాయనిది నీ వాత్సల్యము
Maruvanidi Nee Preema Viduvanidi Nee Krupa Edabaayanidi Nee Vaathsalyamu
మరువనిది నీ ప్రేమ విడువనిది నీ కృప ఎడబాయనిది నీ వాత్సల్యము స్థిరమైనవి నీ తలంపులు అ.ప : ఘనుడా నిన్ను ఘనపరతును నా జీవమున్నంతవరకు ప్రియుడా నిన్ను ప్రణుతింతును నా ప్రాణం ఉన్నంత వరకు అపజయ ధ్వనులే నా చుట్టూ మ్రోగగా నిరీక్షణ లేని నిశిధి వేళలో అజేయుడా! నీ ఆదరణతో నింపి అనంత కృపతో నన్ను స్థిరపరిచినావు ||ఘనుడా||
గమ్యమే యెరుగక కలత చెందగా ప్రయాణమే భారమైన వేళయందున విజేయుడా! నీ విజయానందముతో నడిపించినావు నూతన మార్గమున ||ఘనుడా||
భీకర ధ్వని గల ఎడారిలో నేనుండగా ఆధారమే లేక కృంగిన వేళలో శ్రీమంతుడా! నీ ప్రేమ మాధుర్యము నింపెను నాలో నూతన ఉత్తేజం ||ఘనుడా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.