♪♫
TG-3693
Telugu
మట్టినైన నన్
Mattinaina Nannu
0
views
పల్లవి
మట్టినైన నన్ను మనిషిగా మార్చి జీవ వాయువునూది జీవితాన్ని ఇచ్చావు (2) ఎంత పాడినా – ఎంత పొగిడినా ఎంత ఘనపరచినా – ఎంత కీర్తించినా నీ ఋణమును నేను తీర్చలేనయ్యా నా యేసురాజా నా దైవమా (2) నలిగినా వారికి ఆపత్కాలమున – దుర్గము నీవే నీ శరణుజొచ్చిన జనులందరికి – రక్షణ నీవే (2) నీ ధర్మశాస్త్రము యధార్థమైనది (2) అది మా ప్రాణముల తెప్పరిల్లజేయును (2) ||ఎంత పాడినా||
1వ చరణం
అలసిన వారికి ఆశ్రయపురము – కేడెము నీవే కృంగిన వారిని కృపతో బలపరిచే – జీవము నీవే (2) నీ సిలువ మరణము ఘోరాతి ఘోరం (2) విశ్వ మానవాళికి పాపవిమోచన (2) ||ఎంత పాడినా||