♪♫
TG-3695
Telugu
యేసువా నా యేసువా
Mee Gnaapakaardhamugaa
0
views
పల్లవి
యేసువా.. యేసువా.. యేసువా నా యేసువా (2) మీ జ్ఞాపకార్థముగా భుజించుచున్నాము మీ దివ్య దేహమును తమ ఆజ్ఞానుసారముగా పానము చేసెదము మీ తీరు రుధిరమును ||యేసువా||
1వ చరణం
ఆనాడు మీ దేహమును హింసించి చంపితిమి (2) ఈనాడు ఆ దేహమే మేము గాచుచుండెనుగా (2) మేము గాచుచుండెనుగా ||యేసువా||
2వ చరణం
ఆనాడు మీ రక్తమును చిందింప చేసితిమి (2) ఈనాడు ఆ రక్తమే మేము శుద్ధి పరచెనుగా (2) మేము శుద్ధి పరచెనుగా ||యేసువా||
3వ చరణం
మా పాప భారమును సిలువగ మోసితివి (2) మార్గము చూపితివి రక్షణ నొసగితివి (2) రక్షణ నొసగితివి ||యేసువా||