TG-226
Telugu

మేఘంబుపై నెక్కి మేలుగ ప్రభు

meeghanbupai nekki meeluga prabhu

204
views
పల్లవి

మేఘంబుపై నెక్కి మేలుగ ప్రభు క్రీస్తు యాకసంబున కేగెను ప్రాకటముగను ఆత్మనంది ప్రజ్ఞ మీరగ సాక్ష్యమిచ్చి యేక దీక్షను యేసు రాకకు నెదురు జూడుడటంచు ప్రభువు ||మేఘంబుపై నెక్కి||

1వ చరణం

యూదయ్య సమరయ్య ప్రాంతంబులంతట నాదు వార్తను జాటరే భూదిగంతము వరకు మీరు భూరి సాక్షులగుచు నాకు సాదరంబుగ సత్య విశ్వా సంబులన్ మనుడంచు ప్రభువు ||మేఘంబుపై నెక్కి||

2వ చరణం

గలిలయ్యులార మీ రాశతో నెందుకు తిలకించు చున్నారట్లు వెలయపరమున కెట్లు నేగెనొ యిలకు నా ప్రభువట్లెమరల యలర వచ్చుట మీరు గాంచెద రంచు దూతలు బల్కిరపుడె ||మేఘంబుపై నెక్కి||

3వ చరణం

శ్రీ సంఘ మిదివిను మా యేసు ప్రభు క్రీస్తే భాసిల్ల మఱి వచ్చును యేసు ప్రభుని యడుగు జాడల యేపు మీరగ నడచు కొనుచు నీసు రక్షణ నిలకుజాటుచు నెదురు జూడుము యేసు కొఱకే ||మేఘంబుపై నెక్కి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.