మేలుకొనరే మీ మనంబుల మేలిమిగ
meelukonaree mee mananbula meelimiga
పల్లవి
మేలుకొనరే మీ మనంబుల మేలిమిగ మీ మేరఁ దప్పక పాలు మాలక లేచి దేవుని పాదములు పూజింప గ్రక్కున ||మేలుకొనరే మీ||
1వ చరణం
దిక్కు లెల్లను దేజరిల్లెను దినకరుండుదయింపనయ్యెను మ్రొక్కులకు ప్రతిఫలము నిచ్చెడు మూల కర్తకుఁ గొలువసేయఁగ ||మేలుకొనరే మీ||
2వ చరణం
పక్షులెల్లను గిలకిలంచును బ్రభుని మహిమలు బల్కఁ దొడఁగెను రక్షకుని సకలోపకృతులను రమ్యముగ నుతియించి పాడఁగ ||మేలుకొనరే మీ||
3వ చరణం
నిదుర బోయిన వేళ మిమ్మొక నిమిషమైనను బాసియుండక పదిలముగ రక్షించు దేవునిఁ బ్రస్తుతింప మహాముదంబున ||మేలుకొనరే మీ||
4వ చరణం
మేటియౌ హృదయాబ్జములలో మీ కృతాజ్ఞతా భూషణంబులు నేటుగా ధరియించుకొని యిటు నిర్మలాత్మునిఁ బూజసేయఁగ ||మేలుకొనరే మీ||
5వ చరణం
తెల్లవారఁగఁ దెలియరే యిది తెలివిగల మానవ సమాజము యల్లసిల్లుచు నీతి భాస్కరుఁడుదయ మయ్యెను హృదయముల పై ||మేలుకొనరే మీ||