TG-576
Telugu

మేమిచ్చు కానుకల్ నీవే మాకిచ్చితి

meemichchu kaanukal neevee maakichchithi

202
views
పల్లవి

మేమిచ్చు కానుకల్ నీవే మాకిచ్చితి మా యాస్తియంత ప్రభువా నీ దానమే గదా.

1వ చరణం

నీ వుచితంబుగా మా కిచ్చువాడవు అన్యుల కుచితంబుగా మేమిచ్చుచుందుము. ||మేమిచ్చు కానుకల్||

2వ చరణం

సర్వత్ర బీదలు అన్నంబునొందరు కన్నీళ్లు రాల్చు ప్రజలు అనేకులుందురు. ||మేమిచ్చు కానుకల్||

3వ చరణం

ఈలాటివారికి సహాయమిచ్చుట దూతలు చేయు సేవకు సమానమగును. ||మేమిచ్చు కానుకల్||

4వ చరణం

పోషించి బీదలన్ రక్షించి పాపులన్ అందరిన్ సంరంక్షించుట శ్రీ యేసు కార్యమే. ||మేమిచ్చు కానుకల్||

5వ చరణం

నా బీదవారికి నీవిచ్చు దానము నా కిత్తువను వాక్యము శ్రీ యేసు చెప్పెను. ||మేమిచ్చు కానుకల్||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.