మేము వెళ్లిచూచినాము స్వామి యేసుక్రీస్తును
meemu velllichuuchinaamu svaami yeesukreesthunu
మేము వెళ్లిచూచినాము స్వామి యేసుక్రీస్తును ప్రేమ మ్రొక్కి వచ్చినాము మా మనంబులలరగ ||మేము వెళ్లిచూచినాము||
బేదలేము పురములోన బీద కన్యమరియకుఁ బేదగా సురూపుఁ దాల్చి వెలసెఁ బశులపాకలో ||మేము వెళ్లిచూచినాము||
జ్ఞానులమని గర్వపడక దీనులమై నిత్యము వాని ప్రేమ సకల ప్రజకు మానక ప్రకటింతుము ||మేము వెళ్లిచూచినాము||
తద్దరిశనమందు మాకుఁ బెద్ద మేలు గలిగెగా హద్దులేని పాపమంత రద్దుపరచబడెనుగా ||మేము వెళ్లిచూచినాము||
మరణమెపుడొ రేపొమాపో మరియెపుడో మన మెరుగము త్వరగా పోయి పరమగురుని దరిశనంబుఁ జేతము ||మేము వెళ్లిచూచినాము||
హరిశుద్ధాత్మ జన్మ మాకు వరముగా నొసంగెను పరమపురము మాకు హక్కు పంచెదాను నిరతము ||మేము వెళ్లిచూచినాము||
మాకు సర్వగర్వమణిగి మంచి మార్గమబ్బెను మాకు నీ సువార్తఁ జెప్ప మక్కువెంతోఁ గలిగెను ||మేము వెళ్లిచూచినాము||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.