మీరు బహుగా ఫలించినచో
Meeru Bahugaa Phalinchinacho
మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి ఈ రీతిగా ఫలించినచో శిష్యులై యుండెదరు (2) నీరు కట్టిన తోటవలె నీటి వూటవలె నుండెదరు (2) క్షామములో తృప్తి నిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించును (2) బలపరచును మీ యెముకలను (2) అధికముగా ఫలించుడి (2) ||మీరు||
చెట్లులేని మెట్టలలో నదుల ప్రవహింపజేయు ప్రభువు (2) ఎండియున్న నేలనెల్ల నీటిబుగ్గలుగా జేయువాడు (2) మన ప్రభువైన యేసునందు (2) అధికముగా ఫలించుడి (2) ||మీరు||
వడిగా ప్రవహించు నదిని బోలి విస్తరింపజేయు తన శాంతిని (2) ఐశ్వర్యముతో నింపు మిమ్ము ముదిమివరకు మిమ్ము మోయువాడు (2) మన ప్రభువైన యేసునందు (2) అధికముగా ఫలించుడి (2) ||మీరు||
పాడెదరు మూగవారు గంతులు వేసేదరు కుంటివారు (2) పొగడెదరు ప్రజలెల్లరు ప్రభుని ఆశ్చర్య కార్యములను (2) మహిమ ఘనత చెల్లించుచు (2) హల్లెలూయ పాడెదరు (2) ||మీరు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.