♪♫
TG-2826
Telugu
మెల్లని స్వరమే వినిపించావే చల్లని
mellani svaramee vinipinchaavee challani
78
views
పల్లవి
మెల్లని స్వరమే వినిపించావే చల్లని చూపుతో దీవించినావే వాక్యపు ఒడిలో లాలించినావే ఆత్మీయ బడిలో నన్ను పెంచినావే నీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు పది వేలయా నీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు సుభాగ్యమయా (2) ||మెల్లని||
1వ చరణం
తీయని గీతాన్ని వినిపించాలని చల్లని వేళలో నిను నేను చేరితిని అమృత రాగాన్ని వినిపించాలని (2) నాకంటే ముందుగా నీవొచ్చినావే నీ మాట నా పాటగా మార్చేసినావే కృంగిన కాలములో వేదనల వేళలో సోమసిన సమయములో నిను నేను చేరితిని నా గాథ అంతయు గమనించినావే నా గుండె మంటలను ఆర్పేసినావే
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.